Diwali 2019 : PM Modi Celebrated Diwali With Army Soldiers At Rajouri || Oneindia Telugu

2019-10-28 392

Prime Minister Narendra Modi arrived in Rajouri district on Sunday to celebrate Diwali with Army troops guarding the Line of Control (LoC) in Jammu and Kashmir, officials said. The prime minister's visit coincided with Infantry Day celebrations, which is observed to mark the landing of first Indian troops in Jammu and Kashmir in 1947 to push back Pak supported intruders.
#primeministernarendramodi
#diwali
#jammuandkashmir
#Rajouri
#Diwalicelebration
#indianarmy
#armyjawans

భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోనూ మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కాగా, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన మోదీ ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆర్మీ అధికారులుతో సమావేశంలో ఆర్మీ సిబ్బందితో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. 'స్వయంగా ప్రధాని ఇక్కడకు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకు కృతజ్ఞతలు' అని ఓ సైనికుడు తెలిపారు.